మరింత చేరువలోకి రైల్వే టికెట్ల బుకింగ్‌

New IRCTC e-Ticketing website books over 20,000 tickets in just a minute - Sakshi

సీఎస్‌సీ ఈ–గవర్నెన్స్‌తో ఐఆర్‌సీటీసీ ఒప్పందం

న్యూఢిల్లీ: రైల్వే టికెట్ల బుకింగ్‌ను సామాన్యులకు మరింత చేరువలోకి తెచ్చే దిశగా సీఎస్‌సీ ఈ–గవర్నెన్స్‌తో ఐఆర్‌సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 2.9 లక్షల సాధారణ సేవా కేంద్రాలన్నింటిలోనూ (సీఎస్‌సీ) రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లను బుక్‌ చేసుకునేందుకు ఇది ఉపయోగపడనుంది.

సీఎస్‌సీని నిర్వహించే వారికి ప్రతి టికెట్‌పై రూ. 10 కమీషన్‌ లభిస్తుంది. ప్రస్తుతం 40,000 సీఎస్‌సీల్లో మాత్రమే ఈ సదుపాయం ఉందని, 8–9 నెలల్లో మిగతా అన్ని చోట్లా దీన్ని అందుబాటులోకి తెచ్చేలా ఐఆర్‌సీటీసీ చురుగ్గా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ చెప్పారు.

అలాగే, సీఎస్‌సీల్లో ఎక్స్‌టెన్షన్‌ కౌంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా బ్యాంకింగ్‌ సేవలు మరింతగా విస్తరించేందుకూ ముందుకు రావాలని బ్యాంకులకు ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 60,000 పైచిలుకు వైఫై హాట్‌స్పాట్స్‌ను అందుబాటులోకి తెచ్చే క్రమంలో అటు టెలికం శాఖ 5,000 వైఫై చౌపల్స్‌ను ప్రారంభించింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top