ఎమ్‌ఆర్‌ఎఫ్‌  లాభం రూ.263 కోట్లు  | MRF Q2 profit falls 12.29% to Rs 263.04 crore | Sakshi
Sakshi News home page

ఎమ్‌ఆర్‌ఎఫ్‌  లాభం రూ.263 కోట్లు 

Nov 9 2018 1:58 AM | Updated on Nov 9 2018 1:58 AM

 MRF Q2 profit falls 12.29% to Rs 263.04 crore - Sakshi

న్యూఢిల్లీ: టైర్ల కంపెనీ ఎమ్‌ఆర్‌ఎఫ్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో 12 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.300 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.263 కోట్లకు తగ్గిందని ఎమ్‌ఆర్‌ఎఫ్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.3,660 కోట్ల నుంచి 9 శాతం పెరిగి రూ.4,005 కోట్లకు చేరింది. ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొంది. మూరత్‌ ట్రేడింగ్‌లో భాగంగా బుధవారం నాడు బీఎస్‌ఈలో ఎమ్‌ఆర్‌ఎఫ్‌ షేర్‌ 0.7 శాతం లాభంతో రూ.65,485 వద్ద ముగిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement