భారతీయ భాషలతో మైక్రోసాఫ్ట్‌ ‘టీమ్స్’  | Microsoft Introduce Teams In Local Languages | Sakshi
Sakshi News home page

భారతీయ భాషలతో మైక్రోసాఫ్ట్‌ ‘టీమ్స్’ 

Sep 13 2019 4:46 PM | Updated on Sep 13 2019 5:10 PM

Microsoft Introduce Teams In Local Languages - Sakshi

పని ప్రదేశాలలో కమ్యూనికేషన్, సమన్వయాన్ని సులభం చేసి తమ స్థానిక భాషలోనే పనిచేసేందుకు ఇష్టపడే ఉద్యోగులకు సాధికారత కల్పించే కృషిలో భాగంగా తమ టీమ్ వర్క్ హబ్‌ ‘టీమ్స్’ ద్వారా భారతీయ భాషలకు తోడ్పాటు అందించాలని ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ కృషి చేస్తోంది. డెస్క్‌టాప్‌‌, వెబ్‌కు సంబంధించి 8 భారతీయ భాషలు హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, మరాఠీ, గుజరాతీ, కన్నడ, మలయాళంలో ఈ అప్లికేషన్ మొబైల్ వెర్షన్‌ను తీసుకొస్తున్నామని కంపెనీ తెలిపింది.

భారతీయ భాషల్లో సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి కృషిలో భాగంగా 1998లోనే ప్రాజెక్ట్ భాషను  మైక్రోసాఫ్ట్ ప్రారంభించింది. భారతీయ భాషలకు దాని తోడ్పాటు కేవలం ఉత్పాదకతకే పరిమితం కాకుండా ప్రస్తుతం కృత్రిమ మేధస్సులో కూడా తోడ్పాటు అందించడంపై కంపెనీ దృష్టిసారించింది. కంప్యూటింగ్ సేవలు అందరికి అందుబాటులో ఉండాలనే ఆకాంక్షతో దాన్ని స్థానిక భాషలకు అనుకూలంగా మలచడం ద్వారా సామాన్యులకు మరింత చేరువ కావొచ్చు అని కంపెనీ భావిస్తోంది.

మొబైల్ పరికరాల్లో ఎనిమిది భారతీయ భాషలకు టీమ్స్ తోడ్పాటును విస్తరింపజేసిన మైక్రోసాఫ్ట్ దీని ద్వారా అందరికీ ప్రయోజనం కలిగించాలని లక్ష్యంగా విధించుకుంది. మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ ఉపయోగించడం ద్వారా అనేకరకాల యాప్స్‌ బదులు ఒకే యాప్‌ను వినియోగించవచ్చు. దీని ద్వారా చాట్, సమావేశాలు, కాలింగ్, కంటెంట్ పంచుకోవడం వంటి ప్రక్రియలన్నీ ఒకే చోట ఉంటాయి. ఆఫీస్ 365 యాప్స్‌తో టీమ్స్ సమ్మిళతం అవుతుంది కాబట్టి వినియోగదారులు తమకు నచ్చిన విధంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే తమ అనుభవాలను థర్డ్ పార్టీ యాప్స్, ప్రాసెస్, ఇతర పరికరాలకు విస్తరింపజేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

డెస్క్‌టాప్‌, వెబ్‌పై టీమ్స్
డెస్క్ టాప్‌పై అన్ని భారతీయ భాషల్లో ఎటువంటి ఆటంకాలు లేని టెక్ట్స్‌ ఇన్‌పుట్‌ సహకారాన్ని టీమ్స్ సమకూర్చుతుంది. అంతే కాదు వినియోగదారులు కొన్ని భావాలను మాటల్లో చెప్పలేనప్పుడు తమ సొంత భాషలో ఆసక్తికరమైన స్టికర్స్ ద్వారా పంపించి తమ ఆలోచనలను వెల్లడించవచ్చు. సంభాషణలను మరింత సరదాగా, ఆసక్తికరంగా మల్చుకోవచ్చు. సామాన్య వినియోగదారుడు కూడా సులభంగా అర్థం చేసుకొని ఉపయోగించుకునేలా క్లిష్టమైన పదాల కంటే బాగా వాడుకలో ఉన్న సాధారణ పదాలను మైక్రోసాఫ్ట్ ఉపయోగిస్తోంది. టీమ్ చాట్స్‌లో హిందీ, ఇతర భాషల్లో అనువదించే రియల్ టైమ్ కృత్రిమ మేధస్సు ఫీచర్‌ను కూడా మైక్రోసాఫ్ట్ చేర్చింది. అంతే కాదు ఈ అప్లికేషన్‌లో బాగా పాపులర్ అయిన ఇమ్మర్సివ్ రీడర్ ఇప్పుడు హిందీకి కూడా తోడ్పాటు అందిస్తుంది. దీని ద్వారా టీమ్స్ హిందీలో అందుకునే మెసేజ్‌లను చదివి అవి వినియోగదారునికి అర్థమయ్యేలా మారుస్తుంది. 

మొబైల్ పరికరాల్లో టీమ్స్ 
వినియోగదారులు టీమ్స్ ఇంటర్‌ఫేస్‌ను తమ ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌లలో ఆపరేటింగ్ సిస్టమ్ డిఫాల్ట్ లాంగ్వేజ్ సెట్టింగ్స్ మార్చుకొని సెట్ చేసుకోవచ్చు. దీని ద్వారా హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, మరాఠీ, గుజరాతీ, కన్నడ, మలయాళం భాషలను ఎంచుకోవచ్చు. అయితే టెక్ట్స్ ఇన్‌పుట్ డిఫాల్ట్‌ భాషలకు మాత్రమే పరిమితం కాదు, యూజర్లకు సపోర్టు చేసే ఓఎస్‌ను బట్టి తమకు నచ్చిన భాషల్లో కూడా టైప్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం మైక్రోసాఫ్ట్ ఇండియా న్యూస్ సెంటర్ సందర్శించండి: https://news.microsoft.com/en-in/

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement