ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ లాభం 359 కోట్లు | L&T Infotech net profit rises to Rs 359 crore | Sakshi
Sakshi News home page

ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ లాభం 359 కోట్లు

Jul 19 2019 6:03 AM | Updated on Jul 19 2019 6:03 AM

L&T Infotech net profit rises to Rs 359 crore - Sakshi

న్యూఢిల్లీ: లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) గ్రూప్‌నకు చెందిన ఐటీ కంపెనీ ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌(ఎల్‌టీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.359 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.361 కోట్లు)తో పోల్చితే ఒకటిన్నర శాతం క్షీణత నమోదైందని ఎల్‌టీఐ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.2,156 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ.2,485 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ, ఎమ్‌డీ, సంజయ్‌ జలోన పేర్కొన్నారు. నిలకడ కరెన్సీ రేట్ల మారకం ప్రాతిపదికన ఆదాయంలో 12 శాతం వృద్ధిని సాధించామని తెలిపారు. డిజిటల్‌ సర్వీస్‌ల విభాగం మంచి వృద్ధిని సాధించిందని, తమ మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 39 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. డాలర్ల పరంగా ఆదాయం 12 శాతం వృద్ధితో 36 కోట్ల డాలర్లకు చేరిందని వివరంచారు. ఈ ఏడాది జూన్‌ నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 29,347కు పెరిగిందని, ఆట్రీషన్‌(ఉద్యోగుల వలస) 18.3 శాతంగా ఉందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ షేర్‌ 2 శాతం నష్టంతో రూ.1,578 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement