రూఫ్ గార్డెన్‌తో లుక్కే వేరు! | Look separated Roof Garden! | Sakshi
Sakshi News home page

రూఫ్ గార్డెన్‌తో లుక్కే వేరు!

Feb 21 2015 2:22 AM | Updated on Sep 2 2017 9:38 PM

రూఫ్ గార్డెన్ ఇంటికి అందాన్ని, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది.

సాక్షి, హైదరాబాద్: రూఫ్ గార్డెన్ ఇంటికి అందాన్ని, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. అయితే ఈ రూఫ్ గార్డెన్ నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
రూఫ్ గార్డెన్ నిర్మించాలనుకునే వారు అందుకు అవసరమైన ప్రణాళికను భవన నిర్మాణం చేపట్టిన నాటి నుంచే అమలు చేయాలి.
రూఫ్ గార్డెన్‌తో భవనంపై బరువు పెరుగుతుంది. అందువల్ల పిల్లర్స్‌ను రూఫ్ గార్డెన్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్మించాలి. పిల్లర్లు మోయగలిగిన బరువు కంటే ఎక్కువ బరువు పెరిగితే భవనానికి ముప్పే.
అలాగే అంతస్తు పైకప్పుని చాలా పటిష్టంగా నిర్మించాలి. ఇది పటిష్టంగా లేకపోతే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
⇒  మొక్కల పెంపకానికి అవసరమైన మీడియం (మృత్తిక)ను రాళ్లులేని మట్టితో ఏర్పాటు చేస్తే మంచిది. కొంత ఒండ్రు మన్ను కలిపితే ఇంకా బాగుంటుంది.
భవనం పైభాగం (రూఫ్ డెక్)ను చాలా పటిష్టంగా నిర్మించాలి. మొక్కల వేర్లు, నీళ్లు ఇందులోకి ప్రవేశించకుండా జాగ్రత్త వహించాలి.
మొక్కలకు పోసే నీరు రూఫ్ డెక్ సమీపంలోకి రాకుండా నిర్మించే డ్రైనేజీని వాస్తుకు అనుగుణంగా నిర్మించుకోవాలి. ఈ డ్రైనేజీలో నీరు నిలిచినా, అది కిందికి ఇంకకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ కాంక్రీట్ లేయర్‌ను నిర్మించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement