మళ్లీ ‘సేవలు’ బాగుపడ్డాయి..

Jumbo Electronics launches Big Premier League promotion - Sakshi

మార్చిలో మళ్లీ పట్టాలపైకి...ఏడేళ్ల గరిష్టానికి ఉపాధి అవకాశాలు

నికాయ్‌ ఇండియా ఇండెక్స్‌ 

న్యూఢిల్లీ: భారత్‌ సేవల రంగం మార్చిలో మళ్లీ వృద్ధి బాట పట్టింది. ఉపాధి కల్పన ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌– పీఎంఐ ఈ విషయాన్ని తెలిపింది. మార్చిలో సేవల సూచీ 50.3గా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ సూచీ 47.8 వద్ద ఉంది. పీఎంఐ ప్రమాణాల ప్రకారం– సూచీ 50 పాయింట్ల ఎగువనే ఉంటే దానిని వృద్ధి దశగానే భావించడం జరుగుతుంది. ఆలోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. 

సేవలు–తయారీ వృద్ధి బాటకు.. 
కాగా సేవలు, తయారీ రంగాలు రెండూ కలిపిన నికాయ్‌ ఇండియా కాంపోజిట్‌ ఇండెక్స్‌ కూడా మార్చిలో మంచి మెరుగైన ఫలితాన్నే ఇచ్చింది. పీఎంఐ ఉత్పత్తి ఇండెక్స్‌ మార్చిలో 50.8గా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ సూచీ 49.7 పాయింట్ల వద్ద ఉంది. ఒక్క తయారీ రంగాన్ని చూస్తే మాత్రం, ఈ విభాగం క్రియాశీలత మార్చిలో ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. నికాయ్‌ మార్కెట్‌ తయారీ పీఎంఐ మార్చిలో 51 గా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ పాయింట్లు 52.1 శాతం. అయితే తయారీ ఇండెక్స్‌ వరుసగా గడచిన ఎనిమిది నెలల్లో 50 పాయింట్ల ఎగువనే ఉంది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top