హైదరాబాద్ టు డామం.. జెట్ అదనపు సర్వీసులు | Jet Airways to launch flights to Dammam, Sharjah from Aug | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ టు డామం.. జెట్ అదనపు సర్వీసులు

Jun 14 2016 1:23 AM | Updated on Sep 4 2017 2:23 AM

హైదరాబాద్ టు డామం.. జెట్ అదనపు సర్వీసులు

హైదరాబాద్ టు డామం.. జెట్ అదనపు సర్వీసులు

‘జెట్ ఎయిర్‌వేస్’ తాజాగా హైదరాబాద్-డామం (సౌదీ అరేబియా తూర్పు ప్రాంతం)కు అదనపు విమాన సర్వీస్‌ను నడపనున్నది.

ఆగస్ట్ 7 నుంచి సర్వీసులు ప్రారంభం
ముంబై: ‘జెట్ ఎయిర్‌వేస్’ తాజాగా హైదరాబాద్-డామం (సౌదీ అరేబియా తూర్పు ప్రాంతం)కు అదనపు విమాన సర్వీస్‌ను నడపనున్నది. దీనితోపాటు మంగళూరు-షార్జాకు కూడా కొత్తగా సర్వీసులను ప్రారంభించనున్నది. ఈ డైలీ విమాన సర్వీసులు ఆగస్ట్ 7 నుంచి ప్రారంభం అవుతాయని సంస్థ తెలిపింది. జెట్ ఎయిర్‌వేస్ ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి అబుదాబికి సర్వీసులను నడుపుతోంది. అంటే సంస్థ.. హైదరాబాద్ నుంచి గల్ఫ్ ప్రాంతానికి సర్వీసులు నడుపుతోన్న రెండో పట్టణం డామం. సంస్థ ఇప్పటికే మంగళూరు నుంచి అబుదాబి, దుబాయ్‌లకు విమానాలను నడుపుతోంది. షార్జా సర్వీసులతో కలుపుకుంటే సంస్థ మంగళూరు నుంచి గల్ఫ్ ప్రాంతాలకు మూడు సర్వీసులను నడుపుతున్నట్లు అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement