‘గార్’ అమలుపై నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం | Govt to take call on GAAR implementation soon: Revenue secretary Shaktikanta Das | Sakshi
Sakshi News home page

‘గార్’ అమలుపై నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం

Jul 15 2014 1:18 AM | Updated on Oct 17 2018 5:55 PM

‘గార్’ అమలుపై నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం - Sakshi

‘గార్’ అమలుపై నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం

వివాదాస్పద పన్ను ఎగవేతల నిరోధ చట్టం(గార్)ను ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు.

న్యూఢిల్లీ: వివాదాస్పద పన్ను ఎగవేతల నిరోధ చట్టం(గార్)ను ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన బడ్జెట్ అనంతర చర్చలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గార్ అంశాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. వచ్చే ఏడాది మార్చి 31 వరకూ గార్ అమలును గత ప్రభుత్వం వాయిదా వేసింది. అంటే దీనిపై సమీక్షకు సంబంధించి కొత్త సర్కారుకు ఇంకా 8 నెలలపాటు తగినంత సమయం ఉన్నట్లే’ అని దాస్ పేర్కొన్నారు.
 
ప్రధానంగా పన్నుల రహిత దేశాల్లోని సంస్థల ద్వారా భారత్‌లో పెట్టుబడులపై పన్ను ఎగవేతలను అరికట్టడమే లక్ష్యంగా ఈ గార్ నిబంధలను తీసుకొచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేయాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. కాగా, ఈ షెడ్యూల్ ప్రకారమే గార్‌ను అమలు చేయనున్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ గత వారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలియజేయడంతో ఇన్వెస్టర్ల ఆందోళనలు మళ్లీ తెరపైకివచ్చాయి.

దీంతో ఆర్థిక శాఖ వర్గాలు తాజా వివరణలు ఇస్తున్నాయి. కాగా పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచనల మేరకు మార్పుచేర్పులు జరిగిన ప్రత్యక్ష పన్నుల కోడ్(డీటీసీ) ముసాయిదా బిల్లు తమవద్ద ఉందని.. ప్రభుత్వం దీన్ని విశ్లేషించనుందని దాస్  చెప్పారు. తాజా బడ్జెట్‌లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పెంచేదిశగా అనేక చర్యలు ఉన్నాయని సీఐఐ ప్రెసిడెంట్ అజయ్ శ్రీరామ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement