జీఎంఆర్ ఇన్‌ఫ్రా ప్రమోటర్ల వాటాలు తనఖా | GMR Infra Promoters Pledge 19.13% Stake | Sakshi
Sakshi News home page

జీఎంఆర్ ఇన్‌ఫ్రా ప్రమోటర్ల వాటాలు తనఖా

May 6 2015 1:42 AM | Updated on Sep 3 2017 1:29 AM

జీఎంఆర్ ఇన్‌ఫ్రా ప్రమోటర్ల వాటాలు తనఖా

జీఎంఆర్ ఇన్‌ఫ్రా ప్రమోటర్ల వాటాలు తనఖా

మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ప్రమోట్ చేస్తున్న కంపెనీల్లో మూడు సంస్థలు...

న్యూఢిల్లీ: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ప్రమోట్ చేస్తున్న కంపెనీల్లో మూడు సంస్థలు తమ వాటాలను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రస్ట్ కంపెనీ, ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్‌కు తనఖా పెట్టాయి. జీఎంఆర్ హోల్డింగ్స్, జీఎంఆర్ బిజినెస్ అండ్ కన్సల్టెన్సీ, జీఎంఆర్ ఎంటర్‌ప్రైజెస్ కలిసి మొత్తం 19.13 శాతం వాటాలను తనఖా ఉంచాయి. జీఎంఆర్ ఇన్‌ఫ్రా మాతృసంస్థ జీఎంఆర్ హోల్డింగ్స్ ఏప్రిల్ 28, 30న రెండు విడతలుగా 5.23 శాతం వాటాలను, జీఎంఆర్ ఎంటర్‌ప్రైజెస్ సైతం 0.38 శాతం వాటాలను  ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వద్ద తనఖా ఉంచాయి.

అలాగే జీఎంఆర్ బిజినెస్ అండ్ కన్సల్టెన్సీ 13.52 శాతం వాటాలను రెండు లావాదేవీల్లో ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్, ఐఎల్‌ఎఫ్‌ఎల్ ట్రస్ట్ కంపెనీ వద్ద తనఖా ఉంచాయి. మంగళవారం బీఎస్‌ఈలో జీఎంఆర్ ఇన్‌ఫ్రా షేరు ధర 2.82 శాతం క్షీణించి రూ. 15.48 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement