ఫోర్డ్ ఫిగో కొత్త వేరియంట్ | Ford introduces new-look Figo | Sakshi
Sakshi News home page

ఫోర్డ్ ఫిగో కొత్త వేరియంట్

Sep 16 2014 5:06 AM | Updated on Sep 2 2017 1:25 PM

ఫోర్డ్ ఫిగో కొత్త వేరియంట్

ఫోర్డ్ ఫిగో కొత్త వేరియంట్

ఫోర్డ్ ఇండియా కంపెనీ తన కాంపాక్ట్ కారు మోడల్, ఫోర్డ్ ఫిగోలో కొత్త వేరియంట్‌ను...

 న్యూఢిల్లీ: ఫోర్డ్ ఇండియా కంపెనీ తన కాంపాక్ట్ కారు మోడల్, ఫోర్డ్ ఫిగోలో కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. రానున్న దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఈ కొత్త వేరియంట్‌ను అందిస్తున్నామని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (మార్కెటింగ్, సేల్స్, సర్వీస్) వినయ్ పిపర్సానియా చెప్పారు.

 పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.3.87 లక్షల నుంచి రూ.5.14 లక్షలు, డీజిల్ వేరియంట్ రూ.4.83 లక్షల నుంచి రూ.6.09 లక్షల(అన్నీ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ ధరలు) రేంజ్‌లో ఉంటాయని పేర్కొన్నారు. వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో ఈ కారును అందిస్తున్నామని, 14 అంగుళాల అలాయ్ వీల్స్, ఫాగ్ ల్యాంప్ బెజెల్స్, రియర్ బంపర్ వాలెన్స్ తదితర ఫీచర్లున్నాయని వివరించారు. ఈ కొత్త కారుకు రెండేళ్లు/లక్ష కి.మీ. వారంటీని ఇస్తున్నామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement