ఫ్లిప్‌కార్ట్‌ అతిపెద్ద కార్యాలయం ఇదే! | Flipkart Finds A New, Bigger Home In Bengaluru | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌ అతిపెద్ద కార్యాలయం ఇదే!

Apr 9 2018 12:37 PM | Updated on Aug 1 2018 3:40 PM

Flipkart Finds A New, Bigger Home In Bengaluru - Sakshi

ఫ్లిప్‌కార్ట్‌ కొత్త కార్యాలయం

న్యూఢిల్లీ : ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ బెంగళూరు అతిపెద్ద కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. బెంగళూరులోని ఎంబసీ టెక్‌ విలేజ్‌లో అధునాతన వసతులతో తమ కొత్త క్యాంపస్‌ను తీర్చిదిద్దామని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఈ నిర్మాణంతో బెంగళూరులో వేర్వేరు ప్రాంతాల్లోని తమ కార్యాలయాలను ఎంబసీ టెక్‌ విలేజ్‌ ప్రాంగణానికి తరలించామని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ‘బెటర్‌.టుగెదర్‌’  థీమ్‌ కింద ఫ్లిప్‌కార్ట్‌ ఈ నిర్ణయం తీసుకుంది.  

‘బెంగళూరు వ్యాప్తంగా ఉన్న ఆపీసులన్నింటిన్నీ ఒకే ప్రాంగణానికి చేర్చాలని మేము నిర్ణయించాం. దీనివల్ల నిర్వాహక సామర్థ్యం మెరుగు పడుతుంది. సిబ్బంది-బృందాల మధ్య సమన్వయం అధికమవుతుంది’ అని ఫ్లిప్‌కార్ట్‌ మార్కెట్‌ప్లేస్‌ అధినేత అనిల్‌ గోటేటి పేర్కొన్నారు. ప్రస్తుతం ఏర్పాటుచేసిన కొత్త ప్రాంగణానికి తమ టీమ్‌ను తరలించామని, కొత్త క్యాంపస్‌ ఆపరేషన్స్‌ ప్రారంభమయ్యామని కూడా తెలిపారు. 7,387 మంది పనిచేసేందుకు వీలుగా 8.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కొత్త కార్యాలయం ఉంది. మొత్తం 30 ఫ్లోర్లతో ఈ ఆఫీసు ఉంది. ఈ కార్యాలయాన్ని రూపొందించే సమయంలో ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు, ఐడియాలను స్వీకరించామని గోటేటి తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement