కంపెనీ నుంచి కస్టమర్‌కు ‘బ్యాచ్‌ట్యాగ్‌’ | Another company in the name of batch tag | Sakshi
Sakshi News home page

కంపెనీ నుంచి కస్టమర్‌కు ‘బ్యాచ్‌ట్యాగ్‌’

Feb 28 2018 12:57 AM | Updated on Feb 28 2018 12:57 AM

Another company in the name of batch tag - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఫార్మా రిటైల్‌ చెయిన్‌ మెడ్‌ప్లస్‌ ఫౌండర్‌ మధుకర్‌ గంగాడి.. బ్యాచ్‌ట్యాగ్‌ పేరిట మరో కంపెనీని ఆరంభించారు. ‘‘కంపెనీల్లో తయారైన ఉత్పత్తులు కస్టమర్ల కంటే ముందు డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు చేరుతాయి. వాళ్ల మార్జిన్లు కూడా కలపడంతో అంతిమంగా కస్టమర్‌ను చేరేసరికి వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. దీనికి పరిష్కారం చూపించేదే బ్యాచ్‌ట్యాగ్‌’’ అని మంగళవారం విలేకరులతో చెప్పారు.

కస్టమర్‌ తనకు కావాల్సిన వస్తువులను నేరుగా తయారీ సంస్థల నుంచే కొనుగోలు చేసే వీలుంటుందన్నారు. దీనివల్ల ధరలు మార్కెట్‌ కన్నా 40–80 శాతం వరకు తక్కువగా ఉంటాయన్నారు. ప్రస్తుతం ఫర్నిచర్, డెకరేషన్, హోమ్‌ అప్లియెన్సెస్, నిర్మాణ సామగ్రి వంటి నాలుగైదు విభాగాల్లో ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీదారులతో (ఓఈఎం) ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. గుజరాత్, కాన్పూర్, కోల్‌కతా వంటి నగరాల్లోని 25కి పైగా ఓఈఎంలు, ఒక్కో కేటగిరీ నుంచి 3–4 ఓఈఎంలతో ఒప్పందం ఉంటుందని తెలిపారు. త్వరలోనే ఏసీ, టీవీ, ఫ్రిజ్‌ వంటి హోమ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఓఈఎంలతో ఒప్పందం చేసుకోనున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement