ఎయిర్‌టెల్‌ మరో ఆఫర్‌ : రోజువారీ డేటా పెంపు | Airtel Now Offers 1.5GB Data Per Day With Rs. 349 Plan   | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ మరో ఆఫర్‌ : రోజువారీ డేటా పెంపు

Nov 8 2017 12:46 PM | Updated on Aug 17 2018 6:21 PM

Airtel Now Offers 1.5GB Data Per Day With Rs. 349 Plan   - Sakshi

రిలయన్స్‌ జియోకు మరింత పోటీ ఇచ్చేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ మరో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రూ.349 ప్లాన్‌పై మరింత డేటా అందించనున్నట్టు తెలిపింది. ఈ ప్లాన్‌పై ప్రస్తుతం 1జీబీ డేటా అందిస్తుండగా... ఇక నుంచి రోజుకు 1.5జీబీ 4జీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. అంటే ప్రస్తుతం ఆఫర్‌ చేస్తున్న దాని కంటే 50 శాతం ఎక్కువన మాట. కాగా ఈ ప్లాన్ వాలిడిటీలో ఎలాంటి మార్పు లేదు. 28 రోజుల వరకు వాలిడిటీ ఉంటుంది. ఇక ఈ ప్లాన్‌లో యథావిధిగా రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాల లోకల్, ఎస్‌టీడీ కాల్స్, 3వేల ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.ఇటీవలే ఈ ప్లాన్‌పై పరిమిత కాల వ్యవధిలో 100 శాతం క్యాష్‌బ్యాక్‌ అందించిన సంగతి తెలిసిందే.

రూ.349 ప్లాన్‌పై ఈ మరింత డేటా అందించడంతో పాటు రూ.448తో మరో కొత్త ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ లాంచ్‌ చేసింది. ఈ ప్లాన్‌ కింద 70 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటా చొప్పున 70జీబీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. అంతేకాక ఈ ప్లాన్‌పై అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, రోమింగ్‌పై ఉచితంగా అవుట్‌గోయింగ్‌ కాల్స్‌, 3000 ఎస్‌ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి. మై ఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా ఈ ప్లాన్లను అందుబాటులో ఉంచింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement