‘ఆ 6 ఫ్లాట్ల విలువే రూ . 900 కోట్లు’ | 6 Samudra flats worth Rs 900 crore | Sakshi
Sakshi News home page

‘ఆ 6 ఫ్లాట్ల విలువే రూ . 900 కోట్లు’

Feb 20 2018 5:04 PM | Updated on Sep 27 2018 4:07 PM

6 Samudra flats worth Rs 900 crore - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్‌బీలో భారీ కుంభకోణానికి పాల్పడిన బిలియనీర్‌ జ్యూవెలర్‌ నీరవ్‌ మోదీ ఆస్తులపై ఆదాయ పన్ను శాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. నీరవ్‌కు చెందిన 29 ఆస్తులను ఇటీవల ఐటీ అధికారులు అటాచ్‌ చేశారు. వీటిలో ముంబయిలోని వొర్లిలో సముద్ర మహల్‌లో నీరవ్‌, ఆయన భార్య పేరిట ఉన్న ఆరు ఫ్లాట్ల ఖరీదు రూ 900 కోట్ల పైమాటేనని ఐటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటాచ్‌ చేసిన నీరవ్‌ ఆస్తుల మొత్తం విలువ రూ వేల కోట్లలో ఉంటుందని భావిస్తున్నారు.

వొర్లిలో సముద్రానికి అభిముఖంగా ఉన్న సముద్ర మహల్‌లో ఒక్కో ఫ్లాట్‌ విలువ రూ 150 కోట్లు పైగా పలుకుతుందని సీనియర్‌ ఐటీ అధికారి ఒకరు వెల్లడించారు. నీరవ్‌కు చెందిన ఫైర్‌స్టార్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ముంబయిలో 15 అధిక విలువ కలిగిన స్ధిరాస్తులున్నాయి. వీటిలో బాంద్రాకుర్లా కాంప్లెక్స్‌లో ఓ కమర్షియల్‌ ప్రాపర్టీ కూడా ఉంది. ఒపెరా హౌస్‌లోని ప్రసాద్‌ ఛాంబర్స్‌లో ఫ్లాట్‌తో పాటు ఫోర్ట్‌ ముంబయిలో ఐటీటీఎస్‌ హౌస్‌, లోయర్‌ పరేల్‌లోని ట్రేడ్‌ పాయింట్‌లో ఓ ఫ్లోర్‌ ఆయన కంపెనీకి ఉన్నాయి. అంథేరిలోని ఆర్మీ నేవీ ప్రెస్‌ భవనంతో పాటు, ఢిల్లీలోని ఢిఫెన్స్‌ కాలనీలో నీరవ్‌ కంపెనీకి ఓ ఇల్లు ఉంది. ఇవి కాకుండా దేశ విదేశాల్లోని పలు ప్రాంతాల్లో ఆయనకు ఖరీదైన భవనాలు, స్ధిరాస్తులు ఉన్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement