గ్రహం అనుగ్రహం (03-07-2020)

Daily Horoscope In Telugu 03-07-2020 - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి శు.త్రయోదశి ప.12.54 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం జ్యేష్ఠ రా.12.24 వరకు, తదుపరి మూల వర్జ్యం ఉ.6.45 నుంచి 8.17 వరకు, దుర్ముహూర్తం ఉ.8.11 నుంచి 9.04 వరకు, తదుపరి ప.12.30 నుంచి 1.22 వరకు అమృతఘడియలు... సా.4.01 నుంచి 5.55 వరకు.

సూర్యోదయం :    5.32
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

దినఫలాలు.. (శుక్రవారం, 03-07-20)

మేషం..
బంధుమిత్రుల నుంచి విమర్శలు. అనుకోని ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  వివాదాలు.  ఆస్తి వివాదాలు నెలకొంటాయి. దైవదర్శనాలు.

వృషభం..
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆశించిన డబ్బు సమకూరుతుంది. భూములు, భవనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. .

మిథునం..
ఉద్యోగప్రయత్నాలు కలిసివస్తాయి. బంధువులతో తగాదాలు తీరతాయి. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ఉత్సాహం.

కర్కాటకం..
కార్యక్రమాలలో ఆటంకాలు. బంధుగణం నుంచి విమర్శలు. దూరప్రయాణాలు ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులు. ఉద్యోగాల్లో శ్రమ. వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. .

సింహం..
ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. రాబడి తగ్గి అప్పులు చేస్తారు. బంధువులతో విభేదాలు. అంచనాలు తారుమారు. కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. వ్యాపారులకు ఆటుపోట్లు. ఉద్యోగవర్గాలకు విధి నిర్వహణలో చిక్కులు.

కన్య..
దూరపు బంధువుల కలయిక. శుభకార్యాల రీత్యా ఖర్చులు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు చిక్కులు తొలగే సమయం..

తుల..
కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కార్యక్రమాలలో ఆటంకాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారులకు అంతగా లాభాలు అందవు. ఉద్యోగులకు విధుల్లో ఒడిదుడుకులు.

వృశ్చికం..
కార్యజయం. ఆహ్వానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. అనుకున్న రాబడి ఉంటుంది. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. 

ధనుస్సు..
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబంలో చికాకులు. వాహనాలు, ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం వద్దు. వ్యాపారాలు సామాన్యంగా
ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు. .

మకరం..
నూతన కార్యక్రమాలు చేపడతారు. బంధువుల నుంచి శుభవార్తలు.ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.  వాహన, గృహయోగాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. 

కుంభం..
దూరప్రాంతాల నుంచి ముఖ్యసమాచారం. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారులు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

మీనం..
అనుకోని ప్రయాణాలు. రాబడి తగ్గి అప్పులు చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది.

 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top