ప్రకాశంను డిఫెన్స్‌ హబ్‌గా అభివృద్ధి చేయండి | YSRCP MP YV Subbareddy appealed to Modi on Prakasam district | Sakshi
Sakshi News home page

ప్రకాశంను డిఫెన్స్‌ హబ్‌గా అభివృద్ధి చేయండి

Aug 10 2017 2:14 AM | Updated on Aug 9 2018 4:30 PM

ప్రకాశంను డిఫెన్స్‌ హబ్‌గా అభివృద్ధి చేయండి - Sakshi

ప్రకాశంను డిఫెన్స్‌ హబ్‌గా అభివృద్ధి చేయండి

ప్రకాశం జిల్లాను డిఫెన్స్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్రమోదీని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు.

ప్రధానికి వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి
 
న్యూఢిల్లీ: ప్రకాశం జిల్లాను డిఫెన్స్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్రమోదీని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. రక్షణ రంగానికి చెందిన వివిధ సంస్థల ఏర్పాటుకు జిల్లాలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వివరించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయంలో ఆయన వినతిపత్రం అందజేశారు.

అలాగే బాధిత గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన తర్వాత ఇచ్చిన హామీ మేరకు వెంటనే కిడ్నీ, ఫ్లోరోసిస్‌ నియంత్రణ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే విశాఖకు రైల్వే జోన్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement