’చంద్రబాబుకు ఎంతసేపు ప్రచార ఆర్భాటమే’ | ysrcp mla gadikota srikanth reddy slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

’చంద్రబాబుకు ఎంతసేపు ప్రచార ఆర్భాటమే’

Oct 17 2016 1:54 PM | Updated on Oct 1 2018 2:09 PM

’చంద్రబాబుకు ఎంతసేపు ప్రచార ఆర్భాటమే’ - Sakshi

’చంద్రబాబుకు ఎంతసేపు ప్రచార ఆర్భాటమే’

ఈ రెండున్నరేళ్లలో రైతులు చాలా కష్టాలు పడ్డారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ : ఈ రెండున్నరేళ్లలో రైతులు చాలా కష్టాలు పడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...బంగారం తాకట్టు పెట్టి రైతులు వ్యవసాయం చేశారని, అయితే వారికి భరోసా కల్పించే నాథుడే లేరన్నారు. జూన్లో పడిన వర్షాలతో రైతులు పంట వేశారని, లక్షలాది ఎకరాల్లో వేరుశెనగ పంట వేసినా, పంట చేతికొచ్చిన దాఖలాలు లేవన్నారు.

రైతులకు దిక్కుతోచక తమ పొలాలను తామే దున్నేసుకుంటున్నారన్నారు. చిన్న, సన్నకారు రైతులు నట్టేట మునిగారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎంతసేపు ప్రచార ఆర్భాటమే తప్ప రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి లేదన్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వడంతో పాటు రైతులకు భరోసా కల్పించాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీ అమలు చేయాలని లేకుంటే రీ షెడ్యూలు అయినా చేయాలని అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement