'రైతు నోట్లో మట్టి కొట్టాలనేది చంద్రబాబు ఆలోచన' | YSRCP leader Jyothula Nehru fired on Chandrababu Naidu on Farmer Debt waiver | Sakshi
Sakshi News home page

'రైతు నోట్లో మట్టి కొట్టాలనేది చంద్రబాబు ఆలోచన'

Jul 21 2014 5:46 PM | Updated on Jun 4 2019 5:04 PM

'రైతు నోట్లో మట్టి కొట్టాలనేది చంద్రబాబు ఆలోచన' - Sakshi

'రైతు నోట్లో మట్టి కొట్టాలనేది చంద్రబాబు ఆలోచన'

చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే రాజధానిపై కమిటీ ఏర్పాటు చేసిందని వైఎస్ఆర్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ ఆరోపించారు.

హైదరాబాద్: చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే రాజధానిపై కమిటీ ఏర్పాటు చేసిందని వైఎస్ఆర్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ ఆరోపించారు.  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోటయ్య కమిటీ రిపోర్టు ప్రకారం రైతు నోట్లో ఏ విధంగా మట్టికొట్టాలన్నది చంద్రబాబు ఆలోచన అని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఎస్ఎల్ బీసీ రిపోర్టు, కోటయ్య కమిటీ రిపోర్టుల రెండింటికీ చాలా తేడాలున్నాయని ఆయన తెలిపారు. 
 
కోటయ్య కమిటీ పేరుతో రాష్ట్ర రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. రుణమాఫీని కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టడానికే ఈ డ్రామానా అంటూ ఆయన ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని జ్యోతుల నెహ్రూ సూచించారు. 
 
తన సొంతమనుషుల ఆస్తులు పెంచడమే లక్ష్యంగా. చంద్రబాబు రాజధాని కమిటీ వేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ఎవరబ్బ సొత్తు కాదని,  అందరికీ భాగస్వామ్యం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement