రాజకీయమంటే పేదవాడి గుండెచప్పుడు వినాలి:వైఎస్ జగన్ | ys jagan speech in samaikya shankaravam | Sakshi
Sakshi News home page

రాజకీయమంటే పేదవాడి గుండెచప్పుడు వినాలి:వైఎస్ జగన్

Jan 26 2014 5:41 PM | Updated on Jul 25 2018 4:09 PM

పేదవాడు గుండె చప్పుడు విన్నవాడే అసలైన రాజకీయ నాయకుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

చిత్తూరు:పేదవాడు గుండె చప్పుడు విన్నవాడే అసలైన రాజకీయ నాయకుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సమైక్య శంఖారావంలో భాగంగా  పిచ్చాటూరు బహిరంగ సభకు హాజరైన జగన్ ముందుగా వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడకు చేరుకున్న అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు.  పేదవాడి వైద్యం కోసం పాటు పడ్డ నేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సారేనని, ప్రస్తుతం పాలిస్తున్న పాలకుల్లో పేదవాడికి సాయపడాలన్న ధ్యాసే కరువైందన్నారు.

 

పేదవారికి వైఎస్సార్ దిక్కుగా నిలిచారన్నారు. కుల, మత, ప్రాంతాలకతీతంగా సేవ చేసిన నేత ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డేనన్నారు. రాజకీయమంటే పేదవాడి గుండె చప్పుడు వినాలన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులను చూసి రాష్ట్రాన్ని విడగొడుతున్నారని జగన్ విమర్శించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement