మహానేత కుటుంబంపై విషం చిమ్ముతున్న ఏబీఎన్, టీడీపీ | Youngsters Straight Warning To Andhra Jyothi ,ABN ,Yellow Media | Sakshi
Sakshi News home page

మహానేత కుటుంబంపై విషం చిమ్ముతున్న ఏబీఎన్, టీడీపీ

Aug 12 2018 6:51 AM | Updated on Aug 12 2018 6:58 AM

Youngsters Straight Warning To Andhra Jyothi ,ABN ,Yellow Media - Sakshi

అంబాజీపేట: భారతి సిమెంట్‌ వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగకపోయినా జరిగినట్లు చూపించేందుకు టీడీపీ, ఎల్లో మీడియా ఏబీఎన్‌లు మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి కుటుంబంపై విషం చిమ్ముతున్నారని పలువురు యువకులు ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తునిలో జరుగుతున్న పాదయాత్రలో పలువురు యువకులు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని వైఎస్‌ భారతికి మద్దతుగా నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీబీఐ చార్జిషీట్‌లో భారతిపై ఎలాంటి ఆరోపణలు చేయకపోయినా ఆమె నిందితురాలంటూ ఆరోపణలు చేయడం ఎల్లో మీడియాకు తగదన్నారు. భారతికి ఎటువంటి సమాచారం రాకుండా ఎల్లో మీడియాకు నేరుగా రావడం అంటే టీడీపీ, ఈడీలు విషపూరిత రాజకీయాలు చేస్తున్నారనే విషయం అందరికీ అర్ధమవుతుందన్నారు.

 తిరుగులేని ప్రజాదారణ ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియాలు కలిసి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంగా వైఎస్‌ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు నీచ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఎటువంటి ఆధారలు లేకుండా ఇంటి ఆడపడుచును అవమాన పరచడం దారుణమన్నారు. అసత్య వార్తలను ప్రచురించే ఎల్లో మీడియా పత్రికలను బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement