చంద్రబాబూ తెల్లకాగితంపై సంతకం పెట్టవద్దు! | waives farmers loans:Pocharam demands chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ తెల్లకాగితంపై సంతకం పెట్టవద్దు!

Jun 7 2014 5:17 PM | Updated on Oct 1 2018 1:21 PM

పోచారం శ్రీనివాస రెడ్డి - Sakshi

పోచారం శ్రీనివాస రెడ్డి

రైతుల రుణమాఫీ విషయంలో తెల్లకాగితాలపై సంతకాలు పెట్టి చేతులు దులుపుకోవద్దని ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.

హైదరాబాద్: రైతుల రుణమాఫీ విషయంలో  తెల్లకాగితాలపై సంతకాలు పెట్టి  చేతులు దులుపుకోవద్దని ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడును ఉద్దేశించి తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.  రైతులకు ఇచ్చిన మాటకు చంద్రబాబు కట్టుబడాలన్నారు.

తెలంగాణ రైతులు అధైర్యపడాల్సిన పనిలేదని ఆయన భరోసా ఇచ్చారు. రైతుల ఆత్మహత్యలపై విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. త్వరలోనే రుణమాఫీపై ప్రకటన చేస్తామని  మంత్రి హామీ ఇచ్చారు. లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తామని రైతులకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, వెనక్కితగ్గే ప్రశ్నే లేదని  పోచారం శ్రీనివాస్ రెడ్డి నిన్న స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement