వృత్తి విద్యాబోధకులను క్రమబద్ధీకరించాలి

Vocational Teaching Staff Should Be Regularised In SSA - Sakshi

తాడేపల్లిగూడెం (తాలూకాఆఫీస్‌సెంటర్‌) : ఏపీ సర్వశిక్ష అభియాన్‌ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒప్పంద విధానంలో పనిచేయుచున్న ఆర్ట్, వర్క్, హెల్త్‌ అండ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా సమావేశం ఆదివారం తాడేపల్లిగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు వీర్ల శ్రీరాముల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు హాజరై మాట్లాడుతూ వృత్తి విద్యాబోధకులకు అండగా ఉంటామన్నారు. చేస్తున్న ఉద్యమాలకు తప్పక సహకరిస్తామన్నారు.

ప్రభుత్వానికి వృత్తి విద్యా బోధకుల సమస్యలను తీసుకువెళతామన్నారు. వీర్ల శ్రీరాములు మాట్లాడుతూ మాట్లాడుతూ చాలీచాలనీ వేతనాలతో తాము పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ ప్రభుత్వం బేషరతుగా 60 ఏళ్లు వచ్చేవరకు ఉద్యోగ భద్రత కల్పించాలని, క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే లేనిపక్షంలో రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వపరంగా న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జె.శ్రీనివాస్, జిల్లా కోశాధికారి టి.చినబాబు, భాస్కరరావు, సురేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శాంతకుమారి, సుబ్బారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top