అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత | vigilance officers seazed two lorrys transporting ration shop rice | Sakshi
Sakshi News home page

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

Apr 19 2015 5:04 PM | Updated on Sep 3 2017 12:32 AM

జిల్లాలోని దాచేపల్లిలో రెండు లారీల ద్వారా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.

జిల్లాలోని దాచేపల్లిలో రెండు లారీల ద్వారా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పిడుగురాళ్లకు చెందిన షేక్ సుభానీ, బండ్ల బిక్షమయ్య, షేక్ సదీప్ అనే వ్యక్తులు రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న విజిలెన్స్ సిబ్బంది ఆదివారం మాటువేసి దాడి చేశారు.

 

దాచేపల్లి మండల కేంద్రంలో బియ్యం లోడ్‌తో వెళుతున్న ఓ లారీని పట్టుకుని సీజ్ చేశారు. మండలంలోని పొందుగుల వద్ద మరో లారీని పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రెవెన్యూ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement