తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా కథనాలను ప్రచురించారంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు దాఖలు చేసిన కేసులో పరువునష్టం దావా కేసుల్లో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.
తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా కథనాలను ప్రచురించారంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు దాఖలు చేసిన కేసులో పరువునష్టం దావా కేసుల్లో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఈ కేసు విచారణను కోర్టు అక్టోబరు 18కి వాయిదావేసింది.
ఈ సందర్భంగా రాధాకృష్ణకు వ్యతిరేకంగా తెలంగాణ న్యాయవాదులకు నినాదాలు చేశారు. తప్పుడు కథనాలు ప్రచురించారని, వాటిపై వివరణ ఇవ్వాలంటూ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ‘త్యాగాల సెంటిమెంట్‌తో...భోగాల సెటిల్‌మెంట్’ శీర్షికన ఈఏడాది జూన్ 20న ఆంధ్రజ్యోతి పత్రిక కథనాన్ని ప్రచురించిందని, ఇదే విషయాన్ని ఏబీఎన్ ఛానల్ పదేపదే ప్రసారం చేసిందని, దీంతో తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని తెలిపారు.
అమెరికా మంచి ఉద్యోగాన్ని వదులుకొని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తనపై ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిందని ఆరోపించారు. ఐపీసీ 499, 500 సెక్షన్ల కింద రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు.