
సాక్షి, విజయవాడ : జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణను యువత ఆదర్శంగా తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ యువకులకు సూచించారు. మంగళవారం సత్యనారాయణ 125వ జయంతిని పురస్కరించుకొని లెనిన్ సెంటర్‌లోని ఆయన విగ్రహానికి మంత్రి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విశ్వనాధ సత్యనారాయణ తెలుగు భాషకు ఎనలేని కృషి చేశారని, ఆయన రచనలు మరువలేనివని తెలిపారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకునేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. సత్యనారాయణ నివసించిన ఇంటిని మ్యూజియంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం తెలుగు భాషను, కవులను పట్టించుకోలేదనీ, అందుకే ప్రజలు ఆయనను పక్కన పెట్టారని రచయిత జొన్నవిత్తుల చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు.