కమనీయం.. రమణీయం! 

Vaikunta Ekadasi Was Celebrated In TIrumala - Sakshi

వైభవంగా వైకుంఠ ఏకాదశి

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అన్ని ఆలయాల్లోనూ అంగరంగ వైభవంగా జరిగాయి. భద్రగిరిలో శ్రీసీతారామచంద్రస్వామి వారు మంగళవారం ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ మనోహర దృశ్యాన్ని చూసిన భక్తులు పులకించిపోయారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ఉత్తర ద్వారం వద్ద స్వామివారిని భక్తులు దర్శించుకోవడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోటిలింగాల వద్ద ప్రత్యేక ప్రాకారం ఏర్పాటు చేశారు. అలాగే.. జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని వైకుంఠ ద్వారం ఎదురుగా పుష్పవేదికపై శ్రీలక్ష్మీనృసింహస్వాములైన యోగా, ఉగ్ర, వెంకటేశ్వరస్వాములను ఆసీనులను చేశారు. అటు ఏపీలోని తిరుమలలో ఉదయం శ్రీదేవి,భూదేవి సమేత మలయప్పస్వామి సువర్ణకాంతులతో భక్తులకు అభయ ప్రధానం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్, మాజీ ప్రధాని దేవెగౌడ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్వీ.రమణ, జస్టిస్‌ శాంతన్‌ గండర్, జస్టిస్‌ ఇందూ మల్హోత్ర, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీతారామమూర్తి, çహ్యూమన్‌ రైట్స్‌ కమిషనర్‌ జస్టిస్‌ మీనా కుమారి, ఇస్రో చైర్మన్‌ శివన్, కర్ణాటక సీఎం కుమార స్వామి, ఆయన సోదరుడు రేవన్న, తెలంగాణ సీఎం కేసీఆర్‌ సతీమణి శోభారావు, టీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్యే హరీష్‌రావు తదితరులు మంగళవారం వేకువజామున శ్రీవారిని దర్శించుకున్నారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top