ప్రభుత్వ వైఫల్యం వల్లే ఫిరంగిపురం ఘటన | Ummareddy venkateswarlu takes on state government over Phirangipuram quarry blast | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైఫల్యం వల్లే ఫిరంగిపురం ఘటన

May 27 2017 7:56 PM | Updated on Sep 5 2017 12:09 PM

ప్రభుత్వ వైఫల్యం వల్లే ఫిరంగిపురం క్వారీ ఘటన చోటుచేసుకుందని ఉమ్మారెడ్డి అన్నారు.

హైదరాబాద్‌ : ప్రభుత్వ వైఫల్యం వల్లే ఫిరంగిపురం క్వారీ ఘటన చోటుచేసుకుందని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులపై  కఠిన చర్యలు తీసుకోవాలని ఉమ్మారెడ్డి డిమాండ్‌ చేశారు. మరోవైపు నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement