విశాఖలో ఎలుగుబంటు దాడి; ఇద్దరు మృతి | Two killed, three injured in bear attack | Sakshi
Sakshi News home page

విశాఖలో ఎలుగుబంటు దాడి; ఇద్దరు మృతి

Sep 14 2013 1:00 PM | Updated on May 3 2018 3:17 PM

విశాఖ జిల్లాలో ఎలుగుబంటు దాడి చేసిన సంఘటనలో ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

విశాఖ జిల్లాలో ఎలుగుబంటు దాడి చేసిన సంఘటనలో ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.  జిల్లా గిరిజన ప్రాంతమైన దంబ్రిగూడ మండలంలో శుక్రవారం ఈ సంఘటన జరిగినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. చనిపోయినవారిని జి.బలరామ్ (49), కొర్రా సిబ్బో (51)గా గుర్తించారు. మృతులు గాటివలస గ్రామస్తులు.



తీవ్రంగా గాయపడ్డ దామోదర్కు మొదట స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ కింగ్జార్జ్ ఆస్పత్రికి తరలించారు. బలరామ్, సిబ్బో, దామోదర్తో పాటు మరికొందరు గిరిజనులు సంతకు అరకు వెళ్తుండగా ఎలుగుబంటి వారిపై దాడిచేసినట్టు బాధితులు తెలిపారు. మొదట బలరామ్పై దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అతణ్ని రక్షించేందుకు వెళ్లిన సిబ్బోను తీవ్రంగా గాయపరిచింది. సిబ్బో కూడా సంఘటన స్థలంలోనే మరణించగా, దామోదర్ తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement