ఇద్దరు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు | Two IAS extra charge | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు

May 9 2015 12:13 AM | Updated on Aug 25 2018 6:13 PM

ఇద్దరు ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

హైదరాబాద్: ఇద్దరు ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠాకు కమిషనర్ అప్పీల్స్‌గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డెరైక్టర్ వెంకట్రామిరెడ్డికి సర్వే అండ్ సెటిల్‌మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డెరైక్టరుగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement