పద్మసరస్సులో పడి ఇద్దరు బాలురు మృతి | Two boys drown in Padma lake | Sakshi
Sakshi News home page

పద్మసరస్సులో పడి ఇద్దరు బాలురు మృతి

Oct 9 2015 5:14 PM | Updated on Apr 4 2019 4:44 PM

నారాయణవనం మండలంలోని టీటీడీకి చెందిన పద్మసరస్సులో ఈతకెళ్లి ఇద్దరు బాలురు మృత్యువాత పడ్డారు.

చిత్తూరు (నారాయణవనం) : నారాయణవనం మండలంలోని టీటీడీకి చెందిన పద్మసరస్సులో ఈతకెళ్లి ఇద్దరు బాలురు మృత్యువాత పడ్డారు. మండల కేంద్రానికి చెందిన ఉమాపతి(14), నేతాజి(16) అనే ఇద్దరు బాలురు ఈ ప్రమాదంలో మృతిచెందారు. నేతాజి అనే బాలుడు ఈతకు దిగిన సమయంలో కోనేరులో ఉన్న తామరతీగలు కాళ్లకు అడ్డుపడటంతో బయటకు రాలేక మునిగిపోయాడు. ఉమాపతి.. నేతాజీని కాపాడబోయి అందులోకి దిగగా ప్రమాదవశాత్తూ ఇద్దరూ మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మృతదేహాలను స్థానికులు వెలికితీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement