బెజవాడలో శ్రీవారి నమూనా ఆలయం | TTD Board offers land for Tirupati railway station expansion | Sakshi
Sakshi News home page

బెజవాడలో శ్రీవారి నమూనా ఆలయం

Aug 2 2016 3:56 PM | Updated on Jul 29 2019 7:35 PM

బెజవాడలో శ్రీవారి నమూనా ఆలయం - Sakshi

బెజవాడలో శ్రీవారి నమూనా ఆలయం

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్నమయ్య భవన్‌లో చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది. కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్లో శ్రీవారి నమునా ఆలయం, రోజుకు లక్షమంది భక్తులు దర్శనం చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేయనుంది. అలాగే బుధవారం నుంచి పుష్కర యాత్ర తిరుమల నుంచి ప్రారంభమై 7వ తేదీకి విజయవాడకు చేరనుంది.

పాలకమండలి నిర్ణయాలు...
తిరుపతిలో దక్షిణం వైపు రైల్వే స్టేషన్ ఏర్పాటుకు 74 సెంట్లు స్థలం కేటాయింపు.
ఏడాదిలో స్టేషన్ పనులు పూర్తి చేయాలని నిర్ణయం.
3 లక్షల 50 ఏవల కేజీల కందిపప్పు, 36వేల కేజీల యాలుకలు, లక్ష కిలోల ఉద్దిపప్పు కొనుగోళ్లుకు ఆమోదం.
చిత్తూరు జిల్లా రాయలచెర్వు వద్ద 32 లక్షలతో 46 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటుకు ఆమెదం.
ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో నిధులు వెచ్చించి ఆలయాలను నిర్మాణం.
ద్వారకా తిరుమలలో వికలాంగుల ఆస్పత్రి నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయింపు.
విజయనగరం కొత్తవలసలోని విశ్వేశ్వర ఆయల మరమ్మతులకు నిధుల కేటాయింపు.
వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ చెన్నకేశవ ఆలయానికి, గుంటూరు జిల్లా తాడికొండ ఆలయానికి మహారథాలు ఏర్పాటు.

Advertisement
 
Advertisement
Advertisement