ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Oct22nd Justin Trudeau wins second term | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Oct 22 2019 7:32 PM | Updated on Oct 22 2019 8:10 PM

Today Telugu News Oct22nd Justin Trudeau wins second term - Sakshi

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో వరుసగా రెండోసారి అధికారం నిలబెట్టుకున్నారు. పరాయి భూమిని భారత్‌ కనీసం అంగుళం కూడా ఆక్రమించలేదని, కానీ, భారత భూభాగాన్ని ఎవరైనా ఆక్రమించాలని చూస్తే గుణపాఠం చెప్పే సామర్థ్యం మన బలగాలకు ఉందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌  సింగ్‌ పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమావేశం అయ్యారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట బోటును వెలికితీశారు. కల్కి ఆశ్రమ వ్యవస్థాపకులైన విజయ్ కుమార్ నాయుడు, పద్మావతి నాయుడు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement