
రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదిక అధ్యయనానికి ఏర్పాటైన హై పవర్ కమిటీ నివేదికపై శనివారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. మరోవైపు కేవలం టీడీపీ కోసమే జనసేన పార్టీని పవన్‌కల్యాణ్ నడిపిస్తున్నారని.. ఆ పార్టీకి సిద్ధాంతాలు లేవని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. శుక్రవారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక తమ హైకమాండ్ తెలంగాణ గల్లీలో ఉందని మిగతా పార్టీలకు మాత్రం హైకమాండ్ ఢిల్లీలో ఉందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఇకపోతే భారత అంతర్గత వ్యవహారాలపై ఇతర దేశాల జోక్యం తగదని హంగేరీ విదేశాంగ మంత్రి పీటర్ సిజార్టో హితవు పలికారు. భారత ప్రభుత్వం అవలంబించే విధానాలను అనుసరించి ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో భారతీయులదే తుది నిర్ణయం అని వ్యాఖ్యానించారు.శుక్రవారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.