తిరుమల కాలిబాట క్యూలో తోపులాట | Tirumala trail Queue Crowd | Sakshi
Sakshi News home page

తిరుమల కాలిబాట క్యూలో తోపులాట

Jul 20 2015 2:41 AM | Updated on Sep 3 2017 5:48 AM

తిరుమల కాలిబాట క్యూలో తోపులాట

తిరుమల కాలిబాట క్యూలో తోపులాట

తిరుమలలో ఆదివారం కాలిబాట భక్తుల క్యూలో తోపులాట జరిగింది...

- పెరిగిన రద్దీతో నలిగిన భక్తులు
- సర్వదర్శనానికి 15 గంటలు, కాలిబాట భక్తులకు 7 గంటలు
- హుండీ కానుకలు రూ.3.17 కోట్లు
సాక్షి,తిరుమల:
తిరుమలలో ఆదివారం కాలిబాట భక్తుల క్యూలో తోపులాట జరిగింది. ఊపిరాడక భక్తులు నలిగిపోయారు. కొందరు బలవంతంగా గేట్లు తెరుచుకుని వెలుపల కు వచ్చారు. మరికొందరు అదే గేట్ల ద్వా రా క్యూలోకి ప్రవేశించడంతో పరిస్థితి రె ట్టింపైంది. భక్తుల మధ్య వాగ్వాదం నడిచింది. క్యూల వద్ద తగిన భద్రతా సిబ్బం ది లేకపోవడంవల్లే ఈపరిస్థితి ఎదురైంది.
 
పెరిగిన రద్దీ
గోదావరి పుష్కరాల కోసం వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చా యి. దీంతో భక్తులు తిరుమలకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం 6గంటల వరకు వరకు 64,449 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. వెలుపల కిలోమీటరు వరకు భక్తులు క్యూలో బారులు తీరారు. వీరికి 15 గంటలు, కాలిబాటల్లో నడిచివచ్చిన భక్తులకు 7గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. గదుల కోసం అన్ని క్యూల వద్ద భక్తులు పడిగాపులు కాచారు.  కల్యాణకట్టల్లో తలనీలాలు సమర్పించేందుకు భక్తులు నిరీక్షించక తప్పలేదు. ఆదివారం హుండీ కానుకలు రూ.3.17 కోట్లు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement