అంధుడిపై దాడి | thugs attack on blind person | Sakshi
Sakshi News home page

అంధుడిపై దాడి

Feb 19 2015 9:27 AM | Updated on Apr 3 2019 4:04 PM

గుర్తుతెలియని దుండగులు ఓ అంధుడిపై దాడి చేశారు.

దుగ్గిరాల(గుంటూరు): గుర్తుతెలియని దుండగులు ఓ అంధుడిపై దాడి చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని రామ్‌నగర్‌లో గురువారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. దుగ్గిరాలకు చెందిన ఏసుపాదం(55) అనే అంధ వృద్ధుడు రామ్‌నగర్‌లో జీవనం సాగిస్తున్నాడు. కాగా, కొంతమంది గుర్తు తెలియని దుండగులు గురువారం తెల్లవారుజామున అతనిపై ఇనుపరాడ్డుతో దాడి చేశారు. ఈ దాడిలో ఆ అంధుడు తీవ్రంగా గాయపడ్డాడు.

రక్తం మడుగులో ఉన్న అతన్ని తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి గుంటూరుకు తరలించారు. అతనిపై దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా, ఏసుపాదం భార్య కూడా అంధురాలే కావడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement