రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన దుర్ఘటన నల్లొగొండ జిల్లా పీఏపల్లి వద్ద చోటు చేసుకుంది.
నల్లగొండ: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన దుర్ఘటన నల్లొగొండ జిల్లా పీఏపల్లి వద్ద చోటు చేసుకుంది. కారు బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతులు ప్రకాశం జిల్లా వాసులు రంగస్వామి, ఆయన భార్య లలిత, తల్లి అల్లూరమ్మగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి మార్కాపురం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లా వనమలదిండి వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడి 15 మందికి గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. తిరుమల 2వ ఘాట్‌రోడ్డులో రెండు బస్సులు ఢీకొన్న దుర్ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా శింగరాయకొండ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో 10 మంది గాయపడ్డారు.