‘కేఈ కుటుంబం నుంచి ప్రాణహాని’ | threat from ke krishnamurthy family, says sridevi reddy | Sakshi
Sakshi News home page

‘కేఈ కుటుంబం నుంచి ప్రాణహాని’

May 25 2017 1:44 PM | Updated on Sep 5 2017 11:59 AM

‘కేఈ కుటుంబం నుంచి ప్రాణహాని’

‘కేఈ కుటుంబం నుంచి ప్రాణహాని’

తన భర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని పథకం ప్రకారమే హత్య చేశారని ఆయన భార్య శ్రీదేవిరెడ్డి ఆరోపించారు.

కర్నూలు: తన భర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని పథకం ప్రకారమే హత్య చేశారని ఆయన భార్య శ్రీదేవిరెడ్డి ఆరోపించారు. తన భర్త మరణానికి ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కొడుకు శ్యాంబాబు కారణమని ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆరోపించారు. కేఈ కృష్ణమూర్తి అక్రమాలపై పోరాడినందునే తన భర్తను పొట్టన పెట్టుకున్నారని వాపోయారు. కేఈ కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని చెప్పారు. తమకు ఏం జరిగినా కేఈ కృష్ణమూర్తిదే బాధ్యతని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన భర్తను చంపిన హంతకులకు పోలీసులు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో నిష్పక్ష విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. పత్తికొండ నియోజక​వర్గంలో నారాయణరెడ్డి ఎంతో పేరు సంపాదించుకున్నారని, ప్రజలకు అందుబాటులో ఉండేవారని గుర్తు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement