ఆలయంలోని హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు | Thieves Steal temple Hundi In East Godavari | Sakshi
Sakshi News home page

ఆలయంలోని హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు

Jul 31 2019 9:41 AM | Updated on Jul 31 2019 9:49 AM

Thieves Steal temple Hundi In East Godavari - Sakshi

సీసీ కెమెరాలో నమోదైన చోరీ చేసిన వ్యక్తి చిత్రం 

సాక్షి, తూర్పుగోదావరి : స్థానిక కాపుల కాలనీలో కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో హుండీని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. స్థానికులు, ఆలయ కమిటీ కథనం ప్రకారం.. మంగళవారం తెల్లవారు జామున రెండు గంటల సమయంలో ఆలయం బయట గేటుకున్న తాళాలు తీసి లోపలికి వచ్చి హుండీని ఎత్తుకెళ్లిపోయారని, ఆ హుండీలో సుమారు రూ.10 వేల వరకు ఉంటుందని స్థానికులు తెలిపారు. చోరీ సంఘటన మొత్తం ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నమోదైంది. ఉదయం చోరీ జరిగిన సంగతి తెలుసుకున్న కమిటీ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు. కాగా ఆలయంలో చోరీ జరగడం ఇది రెండో సారి. 

Advertisement
 
Advertisement
Advertisement