ప్రాణం తీసిన ఆర్టీసీ కార్మికుల సమ్మె | The RTC has taken a life of its workers' strike | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఆర్టీసీ కార్మికుల సమ్మె

May 8 2015 3:51 AM | Updated on Sep 3 2019 8:43 PM

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. మండలంలోని కె.నాగులాపురం సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడూరుకు చెందిన హబీ ఫొటోస్టూడియో యజమాని ఎం.ఖాజాబాబు(26) వ్యక్తి దుర్మరణం చెందాడు.

బస్సుల బంద్‌తో భార్యను తీసుకొచ్చేందుకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఫొటోగ్రాఫర్ దుర్మరణం

 
గూడూరు : ఆర్టీసీ కార్మికుల సమ్మె ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. మండలంలోని కె.నాగులాపురం సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడూరుకు చెందిన హబీ ఫొటోస్టూడియో యజమాని ఎం.ఖాజాబాబు(26) వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి... పట్టణానికి చెందిన ఎం.మహబూబ్‌బాషా రెండో కుమారుడు ఎం.ఖాజాబాబుకు రెండు నెలల క్రితం తమిళనాడు రాష్ట్రానికి చెందిన వేలూరు యువతితో వివాహమైంది.

పుట్టింటికి వెళిన భార్య రైలులో కర్నూలుకు వస్తుండగా ఆమెను తీసుకువచ్చెందుకు రాత్రి 8 గంటల సమయంలో ఖాజాబాబు కర్నూలుకు బయలు దేరాడు. సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో బైక్‌పై వెళ్లాడు. మార్గమధ్యంలో కె.నాగులాపురం దాటిన తరువాత కంకర మిషన్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

వాహనదారులు ప్రమాదాన్ని గమనించి కె.నాగులాపురం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ మోహన్ కిషోర్‌రెడ్డి సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement