రెవెన్యూలో టెన్షన్... టెన్షన్ | Sakshi
Sakshi News home page

రెవెన్యూలో టెన్షన్... టెన్షన్

Published Fri, Sep 4 2015 11:34 PM

రెవెన్యూలో టెన్షన్... టెన్షన్

 సాక్షి, విశాఖపట్నం : రెవెన్యూలో బదిలీ లకు రంగం సిద్ధమవడంతో యంత్రాం గంలో గుబులు మొద లైంది. జీవో నెం-68 ప్రకారం బదిలీలుచేయాలని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ పరిపాలనా సౌలభ్యం పేరిట ఎవరినైనా కదిపే అవకాశముండడంతో ప్రతీఒక్కరిలో  టెన్షన్ మొదలైంది. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి బదిలీ చేయాలంటూ గతంలో జీవో-57 జారీ చేశారు. ఈ జీవో ప్రకారం జిల్లాలో 659 మందికి బదిలీలకు అర్హులని లెక్కతేల్చారు. వీరిలో 470 మంది వీఆర్వోలకు కౌన్సెలింగ్ కూడా పూర్తి చేశారు.  ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని మాత్రమే స్థానచలనం కల్పించాలని జారీ చేసిన మార్గ దర్శకాలు మేరకు రెవెన్యూయేతర శాఖల్లో బదిలీలు జరిగాయి.

ఆ తర్వాత జీవో నెం. 68ప్రకారం ప్రస్తుత రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలివ్వడం గందరగోళానికి దారితీసింది. ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారిని బదిలీచేయాలా? మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిరి కదపాలా లేక జీవో నెం.68 ప్రకారం 20 శాతానికి మించి బదిలీలు చేయకూడదో తెలియని మీమాంసలో రెవెన్యూ అధికారులు కొట్టుమిట్టాడు తున్నారు. 15వ తేదీకల్లా బదిలీ ప్రక్రియను పూర్తిచేయాలంటూ మూడో తేదీన జీవో జారీ చేసిన సర్కార్ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను మాత్రం ఇవ్వలేదు. దీంతో రెవెన్యూ యంత్రాంగంలో ఒకింత సందిగ్ధత  కొనసాగుతోంది.

 పైరవీలు ప్రారంభం: మరోపక్క బదిలీలయ్యే వారే కాకుండా, కోరుకున్న పోస్టింగ్ కోసం కూడా రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ల నుంచి తహశీల్దార్ల వరకు పైరవీలు సాగిస్తున్నారు. ఇప్పటికే పరిపాలనా సౌలభ్యం పేరిట పన్నెండు మంది తహశీల్దార్లకు స్థాన చలనం కల్పించారు. తాజాగా బదిలీల ఉత్తర్వుల నేపథ్యంలో మరికొంత మంది తహశీల్దార్లతో పాటు డిప్యూటీ తహశీల్దార్లకు కూడా స్థానచలనం తప్పదని తెలుస్తోంది. తహశీల్దార్ స్థాయి అధికారులే కాదు  ఇతర మినిస్టీరియల్ సిబ్బంది కూడా సొంత ప్రాంతాలు,  కోరుకున్న పోస్టింగ్‌ల కోసం పైరవీలు సాగిస్తున్నారు.

విశాఖ నగర  పరిసర మండలాల్లో తహశీల్దార్లతో పాటు ఇతర కీలక పోస్టుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే వీరంతా మంత్రు లు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నారు. దీంతో వీరు ఇచ్చే సిఫార్సు లేఖలకు యమ గిరాకీ ఏర్పడింది. ఒకటి రెండ్రోజుల్లో మార్గదర్శకాలు విడుదలైతే బదిలీలపై క్లారిటీ వస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement
Advertisement