32 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు


 హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగు సాహిత్యంతోపాటు, భిన్నకళా, సేవా రంగాల్లో విశేష సేవలందించిన 32మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2012 సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది. విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈనెల 28న   విశ్వవిద్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేస్తారు.

 

 పురస్కారాలకు ఎంపికైన వారిలో మన్నవ భాస్కర నాయుడు (సృజనాత్మక సాహిత్యం), హరిశివకుమార్ (పరిశోధన), ‘రుక్మిణి’ టి.రాంరెడ్డి (హాస్య రచన), మంగళగిరి ప్రమీలాదేవి (జీవితచరిత్ర), ఎం.కె.దేవకి (ఉత్తమ రచయిత్రి), ఎస్.జ్యోతిరాణి (ఉత్తమ నటి), జానకీనాథ్ (ఉత్తమ నటుడు), స్నిగ్ధ శ్రీ గోపి సత్య ప్రకాష్ (ఉత్తమ నాటక రచయిత), మేడూరి సత్యనారాయణ (హేతువాద ప్రచారం), శ్రీపాద స్వాతి (ఉత్తమ రచయిత్రి), చిన్ని నారాయణ రావు (వచన కవిత), ఎ.వి.జనార్దనరావు (వివిధ ప్రక్రియలు), ఎం.సదాశివ శర్మ (పత్రికా రచన), ఆముదాలమురళి (అవధానం), పరుచూరు జమున (మహిళాభ్యుదయం), వనంలక్ష్మీ కాంతారావు (నాటక రంగం),  పేట జయలక్ష్మీ (ఆంధ్ర నాట్యం), నాయుని కృష్ణమూర్తి (నవల), ఎ.ఉషాదేవి (సాహిత్య విమర్శ), మల్లవరపు వెంకటరావు (పద్య కవిత), కె.పి.అశోక్ కుమార్ (గ్రంథాలయకర్త), టి.అశోక్‌బాబు (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), కె.వి.నరేందర్(కథ), అమృతలత (సంఘసేవ, నిరంతర విద్య, వ్యక్తిత్వ వికాసం), శిరోమణి వంశీరామరాజు (సాంస్కృతిక సంస్థా నిర్వహణ), సివి.సర్వేశ్వర శర్మ (జనరంజక విజ్ఞానం), అరుణాసుబ్బారావు (జానపద సంగీతం), చొక్కాపు వెంకటరమణ (ఇంద్రజాలం), టి.వేదాంత సూరి (బాల సాహిత్యం) తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top