ఏడాది పాలనలో ఇచ్చిన హామీల అమలులో టీడీపీ విఫలమైందని నిరసిస్తూ ఆ పార్టీ మేనిఫెస్టోలను విజయనగరం, బొబ్బిలి పట్టణాల్లో కాంగ్రెస్ నేతలు సోమవారం దహనం చేశారు.
బొబ్బిలి (విజయనగరం): ఏడాది పాలనలో ఇచ్చిన హామీల అమలులో టీడీపీ విఫలమైందని నిరసిస్తూ ఆ పార్టీ మేనిఫెస్టోలను విజయనగరం, బొబ్బిలి పట్టణాల్లో కాంగ్రెస్ నేతలు సోమవారం దహనం చేశారు. విజయనగరం పట్టణంలో జరిగిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ హామీని టీడీపీ నేర్చవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికి నిరసగా ఆ పార్టీ ఎన్నిల మేనిఫెస్టో 365 ప్రతులను దహనం చేశారు. బొబ్బిలిలో జరిగిన కార్యక్రమంలో మాజీ విప్ శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు మాట్లాడుతూ ఏడాది పాలనలో టీడీపీ అన్ని వర్గాల వారినీ ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు.