టీడీపీ నేత‌ల‌కు భ‌యం ప‌ట్టుకుంది

TDP Leaders Could Not Bear To See  For The Welfare Of The Dalits - Sakshi

సాక్షి, విశాఖ‌ప‌ట్నం: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాలనలో రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతోందని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున‌ అన్నారు. దళిత సంక్షేమానికి పెట్టని కోటగా పరిస్థితి కొనసాగుతుంటే టీడీపీ నాయకులు భరించలేక పోతున్నారని దుయ్య‌బ‌ట్టారు. ఎమ్మెల్యేలు రాజన్నదొర, చెట్టి ఫాల్గుణలతో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 'అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన టీడీపీ నేత‌ల మాట‌లు నీటి మీద రాత‌లే అయ్యాయి. సీఎం జ‌గ‌న్ మాత్రం ఏడాది కాలంలోనే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఆయ‌న‌లో అంబేద్కరిజం కనిపిస్తోంది. ఈమధ్య టీడీపీ నాయకులు ఢిల్లీ వెళ్తే ప్రజల ప్రయోజనాల కోసం ఏమైనా అడుగుతారేమోన‌ని అనుకున్నాను. కానీ స్కాం  కేసులో ఇరుక్కున్న మాజీ మంత్రులను విడిచిపెట్టాలని రాష్ట్రపతిని కలిశారని తెలిసింది. మాజీ సీఎం చంద్రబాబు సహాయకుడు శ్రీనివాసరావు అక్రమాస్తులు బయట పడినప్పుడు, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినప్పుడు ఈ విషయం రాష్ట్రపతికి తెలియజేశారా?’ అంటూ ప్ర‌శ్నించారు.

టీడీపీ పాలనలోచంద్రబాబు సొంతంగా రాజ్యాంగాన్ని అమలు చేశారే త‌ప్పా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎక్కడా అమలు చేయలేదు. చంద్రబాబుకు రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేదని, గతంలో అన్ని రంగాలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషనర్‌గా న్యాయ కోవిదుడైన దళితుడిని నియమిస్తే ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ఆలోచనలు చేస్తుంటే టీడీపీ నేతలు అమరావతిలో వ్యాపారాల కోసం అక్క‌డ ఉద్యమాలు చేస్తున్నార‌న్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తుంటే టీడీపీ నాయకులు అడ్డుకున్నారని మేరుగ నాగార్జున తెలిపారు. (చంద్రబాబు దళిత ద్రోహి: మేరుగ)

అభివృద్ధి భ‌యం ప‌ట్టుకుంది: రాజన్నదొర
విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు స్వాగతిస్తున్నామ‌ని సాలూరు ఎమ్మెల్యే  పీడిక రాజన్నదొర అన్నారు. ఐదేళ్లూ ఉత్తరాంధ్రను పట్టించుకోని టీడీపీ నాయకులు.. ఇప్పుడు సీఎం జ‌గ‌న్ అభివృద్ధి చేస్తుంటే మాత్రం అడ్డుకుంటున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. టీడీపీ హయాంలో గిరిజనులకు ఎంత ఖర్చు చేశారో, త‌మ ప్ర‌భుత్వం ఏడాది కాలంలోనే ఎంత ఖ‌ర్చు చేశామ‌న్న‌దానిపై చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని రాజన్నదొర అన్నారు. టీడీపీ నాయకులకు జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అభివృద్ధి మంత్రం భయం పట్టుకుందని అన్నారు. టీడీపీ హయాంలో గిరిజనులకు మంత్రి పదవి ఇచ్చారా అంటూ ప్ర‌శ్నించారు. శవ రాజకీయం కోసం అర్హత లేని వ్యక్తికి ఆరు నెలలు మంత్రి పదవి ఇచ్చి మధ్యలోని తీసేసారంటూ దుయ్య‌బ‌ట్టారు. టీడీపీ ఐదేళ్ల కాలంలో కనీసం గిరిజన సలహా మండలి కూడా నియమించలేద‌ని రాజన్నదొర పేర్కొన్నారు. 

చంద్రబాబునాయుడు గిరిజనుల ద్రోహి
సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి  అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను ఆదరించారని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. బీసీ ,ఎస్సీ ఎస్టీ మహిళలకు మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన విష‌యాన్ని గుర్తుచేశారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌రరెడ్డి గిరిజ‌నుల‌కు భూమి ప‌ట్టాలిస్తే ఇప్ప‌డు సీఎం జ‌గ‌న్.. నాలుగింత‌లు ఎక్కువ‌గా భూమి పట్టాలిచ్చార‌ని పేర్కొన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో చంద్రబాబునాయుడు బాక్సైట్ తవ్వకాల పేరిట గిరిజనుల ఆస్తులను దోచుకోవడానికే ప్రయత్నించారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top