టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో జిల్లాపై వివక్ష చూపుతోందని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కేం ద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు.
వేటగానివలస (పాచిపెంట) : టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో జిల్లాపై వివక్ష చూపుతోందని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కేం ద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు. పాచిపెంట మండలంలోని గొట్టూరు పంచాయతీకి చెందిన కంచూరు గిరిజన గ్రామంలోనే గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన గొట్టూరు పంచాయతీ వేటగానివలస గ్రా మంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాంతం గిరిజన యూనివర్శి టీ ఏర్పాటుకు ఎంతో అనుకూలమని తెలిపారు.
పత్రికల్లో వస్తున్న కథనాలు చూస్తే గిరిజన యూనివర్శిటీ వేరే ప్రాంతానికి తరలివెళ్లిపోవడం ఖాయంగానే తెలుస్తోందన్నారు. అసలు యూనివర్శిటీ ఏర్పాటుకు ఈ ప్రాంతం ఎందుకు అనుకూలం కాదో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగు రాష్ట్రాలకు ఎంతో అనుకూలమైన ప్రాంతం కావడంతో పాటు కేంద్రమంత్రి ఆశోక్ తన తండ్రికి చెందిన మూడు వేల ఎకరాల పైచిలుకు మాన్సాస్ భూములు కూడా ఉచితం గా ప్రభుత్వానికి ఇస్తామని ప్రకటించినా ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనతో పా టు పార్టీ నాయకులు తిరుపతిరావు, అప్పలనాయుడు, బాబ్జి, ము త్యాలనాయుడు, రాము ఉన్నారు.
పావలా ఖర్చు లేకుండా గిరిపుత్రులకు విద్యుత్ వెలుగులు
గిరిజనులకు ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న సోలార్ ల్యాంప్‌లు ఎంతో ఉపయోగమని, పావలా ఖర్చు లేకుండా వెలుగు లు వస్తాయని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. శని వారం మండలంలోని గొట్టూరు పంచాయతీ వేటగానివలసలో ఐకేపీ ఆధ్వర్యంలో ఐటీడీఏ ద్వారా అందజేసిన సోలార్ ల్యాంపులను ఆయ న గిరిజనులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే సాలూరు నియోజకవర్గంలో అన్ని విధాలగా వెనుకబడిందన్నారు. సోలార్ ల్యాంపులపై నెడ్‌కేప్ ప్రతినిధులు గిరిజనులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఐకేపీ ఎరియా కో ఆర్టినేట ర్ ఎ. చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్, నెడ్‌కేప్ ప్రతినిధి వసంతరావు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టిసారించండి
గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టిసారించాలని ఎమ్మెల్యే రాజ న్నదొర అధికారులకు సూచించారు. ఆయన వేటగానివలస గిరి జన ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలి తీవ్రత పెరుగుతున్నందున ఆప్రమత్తంగా ఉంచాలన్నారు. నిత్యం విద్యార్థులపై దృష్టిసారించాలని చెప్పారు.