పాముకు అరుదైన శస్త్ర చికిత్స

Surgery to White snake in Tanuku - Sakshi

తణుకు టౌన్‌: ఆధునిక సాంకేతిక యుగంలో విష సర్పాలకు కూడా మెరుగైన వైద్య విధానం అందుబాటులోకి వచ్చింది. తణుకులో రాష్ట్ర పశు వైద్యశాలలో శనివారం సాయంత్రం నాగు పాముకు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఆసుపత్రి అసిస్టెంట్‌ పశు శస్త్ర చికిత్సా నిపుణుడు డాక్టర్‌ ఆర్‌.శ్రీధర్‌ సమాచారం ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెంలో గత నాలుగు రోజులుగా తెల్ల తాచు పాము కదల్లేని పడి స్థితిలో వుండగా గ్రామానికి చెందిన రైతులు జంగారెడ్డిగూడెం స్నేక్‌ సేవియర్‌ సంస్థకు సమాచారం అందించారు. దీనితో జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన స్నేక్‌ సేవియర్‌ చదలవాడ క్రాంతి కృష్ణాయపాలెం పొలంలో కదల్లేని స్థితిలో వున్న తెల్ల తాచు పామును శనివారం మధ్యాహ్నం తణుకు పాలి క్లీనిక్‌కు తరలించారు. అక్కడ వైద్యుల సూచన మేరకు పాముకు ఎక్స్‌ రే తీయించగా పాము మెడ భాగంలో బలమైన పశువు తొక్కడంతో పాము మెడ భాగంలో ఎముక విరిగిపోయిందని, దీంతో పాము ఆహారం తీసుకోకపోవడంతో చలనం లేకుండా పడి వుందని వైద్యులు తెలిపారు. 

అనంతరం వైద్యుల పర్యవేక్షణలో పాముకు ఆహారం అందించి, మెడ చుట్టూ స్లి్పంకర్లు వేసి చికిత్స చేసినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం పాముకు వారం రోజుల సరిపడా ఆహారం అందించామని డాక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకూ 10,880 ఆపదలో వున్న పాములను రక్షించి అటవీ ప్రాంతంలో వదిలినట్లు క్రాంతి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top