
జోరుగా నవ్వొచ్చు
ఈ నెల ఏడున విడుదల కానున్న ‘జోరు’ సినిమా చూస్తూ రెండు గంటల పాటు కడుపుబ్బా నవ్వుకోవచ్చని ఆ చిత్రం హీరో సందీప్ కిషన్ తెలిపారు.
తిరుమల: ఈ నెల ఏడున విడుదల కానున్న ‘జోరు’ సినిమా చూస్తూ రెండు గంటల పాటు కడుపుబ్బా నవ్వుకోవచ్చని ఆ చిత్రం హీరో సందీప్ కిషన్ తెలిపారు. నైవేద్య విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని బుధవారం దర్శించుకున్నారు. అనంతరం సందీప్ కిషన్ మీడియాతో మాట్లాడారు. ఎప్పటినుండో స్వామిని చూడాలనుకుంటున్నానని, ఇప్పటికి టైం కుదిరిందన్నారు. రాబోమే కాలంలో పెద్ద హీరోలతో కూడా నటించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.
నేను ఈ రోజు ఇంత స్ధాయికి రావటానికి శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులేనన్నారు. బాలీవుడ్‌లో కూడా ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. వచ్చే ఏడాదిలో హిందీలో ఓ కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు. హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కంటే తెలుగులో నటించటమంటేనే తనకు ఇష్టమన్నారు. ఆలయం వెలుపల సందీప్ కిషన్‌ను చూడటానికి అభిమానులు ఉత్సాహం చూపారు. ఆయనతో ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసున్నారు.