గణతంత్ర వేడుకల్లో అపశృతి | Student dies of electrocution | Sakshi
Sakshi News home page

గణతంత్ర వేడుకల్లో అపశృతి

Jan 26 2016 5:21 PM | Updated on Nov 9 2018 4:36 PM

తాడిపత్రి మండలం కావేరిసముద్రం గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయజెండాను సరిచేసేందుకు ఇద్దరు విద్యార్థులు పక్కనే ఉన్న భవనం ఎక్కారు.

తాడిపత్రి (అనంతపురం జిల్లా) : తాడిపత్రి మండలం కావేరిసముద్రం గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయజెండాను సరిచేసేందుకు ఇద్దరు విద్యార్థులు పక్కనే ఉన్న భవనం ఎక్కారు. సరిచేసే సమయంలో కరెంట్ తీగలు తగిలి వంశీవర్ధన్(13) అనే 8వ తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా..మనోజ్ అనే విద్యార్థికి గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థిని సమీప ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement