అనంత నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశం రసాభాసగా మారింది.
కొట్టుకున్నటీడీపీ కార్పొరేటర్లు
Sep 8 2017 12:54 PM | Updated on Jun 1 2018 8:45 PM
అనంతపురం: అనంత నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ కార్పొరేటర్లు ఒకరి పై ఒకరు బాహాబాహీకి దిగారు. ఎంపీ జేసీ వర్గయుడిగా ముద్రపడ్డ టీడీపీ కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు పై టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు దాడి చేశారు.
తన డివిజన్ కు అన్యాయం జరిగిందని.. కులగజ్జితో వ్యవహరిస్తున్నారని సమావేశంలో ఉమామహేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రెచ్చిపోయిన మరో టీడీపీ కార్పొరేటర్ నరేశ్ చౌదరి ఉమా పై దాడికి పాల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement