మృత్యువు వెంటాడింది.. ఎవరూ ఊహించని వి దంగా ఓ వృద్ధుని ప్రాణాలు తీసింది.. జాలరిపల్లిపాలెంలో ఇంటి దగ్గర ప్ర శాంతంగా టీ తాగుతున్న వృద్ధునిపైకి స్కార్పియో
=ఇంట్లోకి దూసుకెళ్లిన స్కార్పియో
=వృద్ధుని దుర్మరణం
పెదగంట్యాడ, న్యూస్‌లైన్: మృత్యువు వెంటాడింది.. ఎవరూ ఊహించని వి దంగా ఓ వృద్ధుని ప్రాణాలు తీసింది.. జాలరిపల్లిపాలెంలో ఇంటి దగ్గర ప్ర శాంతంగా టీ తాగుతున్న వృద్ధునిపైకి స్కార్పియో వాహనం దూసుకొచ్చి నిండు ప్రాణాన్ని బలిగొంది. స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తూ పదవీ విరమణ చేసిన పేర్ల పోలయ్య (70) గంగవరం మత్స్యకార గ్రామాల్లోని జాలరిపల్లిపాలెంలో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.
నాలుగు రోజుల క్రితం భార్య దానయ్యమ్మ కాలు జారి పడిపోవడంతో ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలయ్య బుధవారం ఉదయం ఇంటి బయట టీ తాగుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన పుక్కా ల రాజు తన స్కార్పియో వాహనాన్ని ఇంట్లో నుంచి బయటికి తీశాడు. అతని స్నేహితుడు మైలపిల్లి పోలయ్య (27) వాహనం నేర్చుకుంటాననడంతో రాజు డ్రయివర్ పక్క సీట్లో కూర్చున్నాడు.
ఇంటి నుంచి బయలుదేరి సుమారు 30 మీటర్ల దూరం దాటకముందే పోల య్య ఎక్స్‌లేటర్‌పై కాలు వేయడంతో ఒక్కసారిగా వేగం పుంజుకుంది. ఏం చేయాలో తెలియక ఎడమవైపునకు తిప్పడంతో బయట టీ తాగుతున్న పేర్ల పోలయ్యపైకి వాహనం దూసు కెళ్లింది. ప్రహరీని ఢీకొని లోపల ఇంటి గోడను ఢీకొని ఆగిపోయింది. ప్రమాదంలో పోలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
బంధువుల ఆగ్రహం
విషయం తెలుసుకున్న న్యూపోర్టు ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. మృ తుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. నష్టపరిహారం చెల్లించిన తరువాతే మృతదేహాన్ని తరలించాలని పట్టుబట్టారు. ఒక దశలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామస్తులు వెనక్కి తగ్గకపోవడంతో న్యూపోర్టు సీఐ ఎస్.విద్యాసాగర్, స్టీల్‌ప్లాంట్ ట్రాఫిక్ సీఐ పెంటారావు సంఘటనా స్థలానికి చేరుకొని వారితో చర్చించారు. చివరికి రూ.5 లక్షలు చెల్లించేందుకు స్కార్పి యో యజమాని ఎం.రాజు అంగీకరించడంతో గ్రామస్తులు శాంతించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారకుడైన మైలపిల్లి పోలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.