స్వచ్ఛ కార్యక్రమంలో ఎస్పీ బాలు | SP Balu partisipeted in swach challapalli | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ కార్యక్రమంలో ఎస్పీ బాలు

Sep 26 2015 10:31 AM | Updated on Sep 3 2017 10:01 AM

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కృష్ణా జిల్లా చల్లపల్లిలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కృష్ణా జిల్లా చల్లపల్లిలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.4 లక్షలతో ఆధునీకరించిన బస్టాండ్‌ను ప్రారంభించారు. పలు చోట్ల మొక్కలు నాటారు. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేశారు. అనంతరం స్థానిక ఎస్‌ఆర్‌వైఎస్పీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, సన్‌షైన్ హాస్పిటల్స్ ఎండీ గురవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 320 రోజుల నుంచి ఇక్కడ స్వచ్ఛ కార్యక్రమం జరుగుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement